సంవత్సరం తర్వాత తన కూతుర్ని చూపించిన సూపర్ స్టార్
on Dec 26, 2023
భారతీయ చిత్ర పరిశ్రమలో హీరోలని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో వాళ్ళ పిల్లలని కూడా అంతే ఇదిగా అభిమానిస్తారు. అదే టైంలొ తమ హీరోకి పుట్టిన పిల్లలని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో కూడా అభిమానులు ఉంటారు. కారణాలు ఏమైనా గాని ఇప్పుడు కొంత మంది హీరోలు మాత్రం తమ పిల్లలని పుట్టిన వెంటనే మీడియాకి చూపించటం లేదు. ఈ కోవలో చేరే జంటల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అండ్ అలియాభట్ ల జంట కూడా ఒకటి. కానీ ఈ ఇద్దరు నిన్న చేసిన పనితో వాళ్ళ అభిమానులకి డబుల్ క్రిస్మస్ వచ్చింది.
రణబీర్ అండ్ అలియా భట్ గత ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. నవంబర్ లో వీరికి ఒక పాప జన్మించింది. అప్పటి నుంచి నిన్నటి వరకు వీళ్ళు తమ పాప ముఖాన్ని బయట ఎవరకి చూపించలేదు. పాప పేరు మాత్రం రాహా అని అందరికి చెప్పారు. అప్పట్లో చాలా మీడియా సంస్థలు తమ కెమెరాలో పాపని బంధించడానికి చూసారు కానీ కుదరలేదు. మీడియా చేస్తున్న అత్యుత్సాహానికి అలియా మీడియాని ఒకసారి మందలించింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత క్రిస్మస్ కానుకగా అలియా రణబీర్ లు కలిసి తమ పాప రాహా ని మీడియా కి పరిచయం చేసింది. పాప అయితే చాలా ముద్దుగా బొద్దుగా ఉంది.ఇప్పుడు సోషల్ మీడియాలో రాహా ని చూస్తున్న వాళ్లంతా రాహా అచ్చం అలియా లాగానే ఉందని కామెంట్లు పెడుతున్నారు.
రణబీర్ మొన్ననే యానిమల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాని చూపించారు. 900 కోట్లు దాకా ఆ సినిమా రాబట్టింది. అలియా కూడా గత ఏడాది ఆర్ఆర్ఆర్ తో తన సత్తా చాటింది. అలాగే కొన్ని రోజుల క్రితం రణబీర్ అలియా ల మధ్య గొడవలు జరిగి విడి విడిగా ఉంటున్నారని వచ్చిన వార్తలకి నిన్నటితో చెక్ పడింది.
Also Read